డయాబెటిక్ డైట్: డయాబెటిస్ కోసం పరిపూర్ణమైన వంటపుస్తకం - Shepard Lindsay 2 стр.


తయారు చేయు విధానం:

1 మొదటిగా, ఓవన్ ను సుమారు 180 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేయండి

2 ఇప్పుడు, మిరియాలు (నలుపు), పప్రికా మిరపకాయ, చీజ్ (పర్మేసన్) మరియు పార్స్లీ కోసం మిక్సింగ్ కంటైనర్ దగ్గర పెట్టుకోండి.

3 ఆ తర్వాత, మసాలా మిశ్రమంతో చేప ఫైలెట్లను వేసి కవర్ చేయండి. నూనె (ఆలివ్) వేసి, ఆపై మిశ్రమం జాగ్రత్తగా సమానంగా వాటికి పట్టేలా కలపండి.

4 చేపలు రెడీ అయిన తర్వాత, ఫైలెట్లను ట్రే పైన అమర్చండి మరియు సుమారు పద్నాలుగు నుండి పదిహేడు నిమిషాలు ఓవెన్లో ఉంచండి

5 చివరగా, ఒకటికి రెండుసార్లు చెక్ చేసి చేపలను పూర్తిగా ఉడికించి, పైన ఒక పొరలా ఏర్పడేలా చీజ్ వేయండి. చీజ్ మంచిగా పెళుసైనంత వరకు కొన్ని క్షణాలు అలాగే ఉంచండి, తర్వాత తీసివేసి, సర్వ్ చేయండి. వెజ్జీస్ లేదా తక్కువ కార్బ్ వున్న బ్రౌన్ రైస్‌తో ఆనందించండి.

రుచికరమైన ఆలోచన #8: త్వరగా సులభంగా చేసే తక్కువ కార్బ్ గల చిప్స్

ఎంతమందికి వడ్డించవచ్చు: 4

వండడానికి పట్టే సమయం: 28 నుండి 34 నిమిషాలు

కేలరీలు: 91.7

కొవ్వులు: 8.1 గ్రా

ప్రోటీన్లు: 3.2 గ్రా

పిండి పదార్థాలు: 2.8 గ్రా

మీకు కావలసిన పదార్థాలు:

 ఉప్పు (ఇష్టపడినంత)

 మిరియాలు (ఇష్టపడినంత)

 బేకన్ (స్లైసెస్, ఎనిమిది)

 నూనె (ఆలివ్, 18.5 గ్రా)

తయారు చేయు విధానం:

1 మొదటిగా, సుమారు 180 డిగ్రీల సెల్సియస్ వరకు ఓవెన్ ను సెట్ చేయండి

2 తరువాత, నూనె (ఆలివ్) తో ట్రేని గ్రీజు చేయండి లేదా మీకు నచ్చిన నూనె ఏదైనా పర్వాలేదు. అప్పుడు, బేకన్‌ను చిన్నగా, కొరికేటంత-పరిమాణంలో వున్న ముక్కలుగా విడదీయండి

3 తరువాత, మీ రుచికి తగినట్లు మిరియాలు & ఉప్పుతో సీజన్ చేయండి.

4 ఆ తర్వాత, సుమారు పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క నిమిషాలు ఓవెన్లో పెట్టండి. బయటకు తీసి చల్లబరచండి.

5 పట్టుకొనేటంత చల్లగా అయిన తర్వాత, బిట్స్ తీసుకొని మీడియం ఫైర్ మీద స్కిల్లెట్ లేదా పాన్ లో ఉంచండి. ఈ ప్రక్రియ సాధారణంగా నాలుగు నుండి ఆరు నిమిషాలు పడుతుంది. మంట మీద నుండి తీసివేసి చిప్స్‌గా వడ్డించండి. మీరు తక్కువ కొవ్వు, తక్కువ కార్బ్ డిప్‌తో కలిపి ఆకలిపుట్టించే వంటకం వలె వడ్డించండి!

రుచికరమైన ఆలోచన #9: నమ్మశక్యంగాని తక్కువ కార్బ్ వున్న సౌత్ ట్రీట్


ఎంతమందికి వడ్డించవచ్చు: 3 నుండి 4

వండడానికి పట్టే సమయం: 29 నుండి 32 నిమిషాలు

కేలరీలు: 288

కొవ్వులు: 22.3 గ్రా

ప్రోటీన్లు: 18.9 గ్రా

పిండి పదార్థాలు: 2.7 గ్రా

మీకు కావలసిన పదార్థాలు:

 టర్కీకోడి చాతిభాగం (రోస్టు చేసింది, 225 గ్రా, చాప్ చేసింది)

 చీజ్ (పర్మేసన్, 75 గ్రా)

 చెద్దర్ చీజ్ (తురిమినది, 225 గ్రా)

 తెల్లని చెద్దర్ చీజ్ (తురిమినది, 225 గ్రా)

మీకు కావలసిన పదార్థాలు:

1 మొదటిగా, సుమారు 180 డిగ్రీల సెల్సియస్ వరకు ఓవెన్ ను సెట్ చేయండి.

2 తరువాత, మిక్సింగ్ కంటైనర్ తీసుకొని అన్ని చీజ్లను కలపండి. మీరే దాన్ని కలపొచ్చు లేదా ఎలక్ట్రిక్ మిక్సర్‌ను ఉపయోగించవచ్చు. అప్పుడు, ఒక చెంచా మిక్స్ తీసుకొని బేకింగ్ షీట్ మీద ఒక ముద్దలా ఉంచండి. మీరు కుకీల పిండిని అమర్చినట్లుగా అమర్చండి. ఒక్కొక్క ముద్దకు మధ్య ఒక అంగుళం దూరం ఉండేలా పెట్టండి.

3 షీట్ నింపిన తరువాత, సుమారు ఏడు నుండి ఎనిమిది నిమిషాలు ఓవన్ లో వుంచండి. దయచేసి చిప్స్ మాడిపోకుండా చూసుకోండి. అంచులు బంగారు గోధుమ రంగులోకి మారినప్పుడు చిప్స్ బాగా ఉడుకుతాయి. అప్పుడు, వాటిని బయటకు తీసి, చల్లబరచండి.

4 చివరగా, టర్కీకోడి చాటిభాగాన్ని తీసి కట్ చేయండి మరియు తక్కువ-చక్కెర వున్న డిప్ తో చిప్స్ సర్వ్ చేయండి. దీన్ని ఒక స్నేక్ లాగా లేదా ఎంట్రీగా అంటే భోజనానికి ముందు మొదటి వంటకం వలె వడ్డించండి.

రుచికరమైన ఆలోచన #10: తక్కువ చక్కెరగల ఇటాలియన్ స్నాక్ ఆప్సన్

ఎంతమందికి వడ్డించవచ్చు: 4 నుండి 6

వండడానికి పట్టే సమయం: దాదాపు 22 నిమిషాలు

కేలరీలు: 226

కొవ్వులు: 23.7 గ్రా

ప్రోటీన్లు: 18.4 గ్రా

పిండి పదార్థాలు: 5.7 గ్రా

మీకు కావలసిన పదార్థాలు:

 మోజారెల్లా చీజ్ (తురిమినది, 225 గ్రా)

 మిరియాలు: (ఇష్టపడినంత)

 మసాలా (ఇటాలియన్, 14.5 గ్రా)

 పెప్పరోని (115 గ్రా, తరిగినది)

 వెల్లుల్లి (పొడి, 8.5 గ్రా)

 ఉప్పు (ఇష్టపడినంత)

 అధనంగా చేసుకొనే ఎంపిక: డిప్పింగ్ కొరకు మరినారా సాస్

తయారు చేయు విధానం:

1 మొదటిగా, సుమారు 180 డిగ్రీల సెల్సియస్ వరకు ఓవెన్ ను సెట్ చేయండి.

2 తరువాత, చిన్న మఫిన్ ట్రే తీసుకొని స్ప్రే (కుకింగ్) తో స్ప్రే చేయండి. దాన్ని ఒక ప్రక్క పెట్టండి.

3 అప్పుడు, మిక్సింగ్ కంటైనర్లో, మిరియాలు & చీజ్, వెల్లుల్లి (పొడి), ఉప్పు మరియు మసాలా (ఇటాలియన్) కలపండి. చీజ్ బాగా కలపి, దానికి మసాలా జోడించండి. ఒక చెంచానిండుగా మిశ్రమాన్ని తీసుకుంటూ ట్రేలో మఫీన్ పెట్టడానికున్న ప్రతి స్థలంలో ఆ మిశ్రమాన్ని ఉంచండి.

4 తరువాత, ప్రతి మఫీన్ పైన పెప్పరోని వేయండి. అలా సిద్ధం చేసిన తర్వాత, ఎనిమిది నుండి పది నిమిషాలు ఓవెన్లో ఉంచండి. ఈ సమయం గడిచాక, చీజ్ అన్ని వైపులా కరిగి, వాటిచుట్టూ లేత గోధుమ రంగులోకి వస్తుంది.

5 చివరగా, వాటిని బయటకు తీసి, చల్లబరచండి మరియు తక్కువ-చక్కెర వున్న సాస్‌తో వడ్డించండి (మరినారా సాస్ చాలా రుచిగా ఉంటుంది). స్నాక్ లాగా వడ్డించండి లేదా మాంసంతో పాటు వడ్డించండి.

Назад